Advertisement

తెలంగాణాలో కరోనా రికవరీ రేట్ 96.88 శాతం

By: Sankar Wed, 16 Dec 2020 10:57 AM

తెలంగాణాలో కరోనా రికవరీ రేట్ 96.88 శాతం


గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 536 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,79,135కు చేరాయి.

కొత్తగా 622 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,70,450 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో ముగ్గురు వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా... ఇప్పటి వరకు 1,502 మంది వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల రేటు 0.53శాతంగా ఉందని, అలాగే రికవరీ రేటు 96.88శాతంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ చెప్పింది..

ప్రస్తుతం 7,183 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 5,041 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపింది. మంగళవారం ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 52,057 శాంపిల్స్‌ పరీక్షించగా.. ఇప్పటి వరకు 62,57,754 టెస్టులు చేసినట్లు వివరించింది.

Tags :
|
|

Advertisement