Advertisement

తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

By: Sankar Mon, 19 Oct 2020 08:56 AM

తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా కేసులు..


తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పడిపోయింది.. ఎంతలా అంటే.. కొత్త కేసులు వెయ్యి లోపే నమోదు అయ్యాయి. అసలు విషయం ఏంటంటే.. నిన్న ఆదివారం కావడంతో టెస్ట్‌ల సంఖ్య కూడా అనూహ్యంగా తగ్గిపోయింది.. దీంతో కొత్త కేసులు తగ్గిపోయాయి.

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 948 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 1,896 మంది రికవరీ అయ్యారు. నలుగురు మాత్రమే మృతిచెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,23,059కు చేరుకోగా... ఇప్పటి వరకు 2,00686 మంది రికవరీ అయ్యారు. 1,275 మంది మృతిచెందారు..

ఇక, దేశవ్యాప్తంగాకరోనా మృతుల సంఖ్య 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.57 శాతానికి తగ్గిందని.. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 88.2 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 89.96 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్రంలో 21,098 యాక్టివ్‌ కేసులు ఉండగా.. గత 24 గంటల్లో 26,027 టెస్ట్‌లు మాత్రమే నిర్వహించారు.

Tags :

Advertisement