Advertisement

  • తెలంగాణాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా ..ఆ జిల్లా వాసులకు భారీ ఊరట

తెలంగాణాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా ..ఆ జిల్లా వాసులకు భారీ ఊరట

By: Sankar Mon, 17 Aug 2020 10:21 AM

తెలంగాణాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా ..ఆ జిల్లా వాసులకు భారీ ఊరట


తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 8794 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 894 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 92,255 కు చేరింది. కొత్తగా 2006 మంది వైరస్‌ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 70,132 కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 21,420 యాక్టివ్‌ కేసులున్నాయి. తాజాగా 10 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 703 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 76.01 శాతంగా ఉంది. ఈమేరకు వైద్యారోగ్యశాఖ సోమవారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 7,53,349 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది.

ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 147 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 85, కరీంనగర్ 69, పెద్దపల్లి 62, సిద్దిపేట 58, ఖమ్మం 44 చొప్పున కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి, నారాయణపేట, నిర్మల్ జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. వికారాబాద్, భువనగిరి జిల్లాలో ఒకటి చొప్పున కొత్త కేసులను గుర్తించారు.

Tags :
|
|
|

Advertisement