Advertisement

తెలంగాణాలో తాజా కరోనా కేసులు ఎన్నంటే !

By: Sankar Fri, 20 Nov 2020 09:13 AM

తెలంగాణాలో తాజా కరోనా కేసులు ఎన్నంటే !

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 894 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,61,728 కు చేరింది.

24 గంటల్లో నలుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,423కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,057 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,47,790కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 12,515యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 39,448 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 50,50,612కు చేరింది..

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే గ్రేటర్ పరిధిలో అత్యధికంగా 154 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ...ఇక ఆ తర్వాత మేడ్చల్ లో 84, రంగారెడ్డి లో 70,కొత్తగూడెం లో 54, నల్గొండలో 48, ఖమ్మం లో 39, కరీంనగర్ లో 36 పాజిటివ్ కేసులు నమవుదు అయ్యాయి..

Tags :
|
|
|

Advertisement