Advertisement

  • తెలంగాణాలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణాలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Sat, 28 Nov 2020 12:02 PM

తెలంగాణాలో తగ్గుముఖం పడుతున్న కరోనా పాజిటివ్ కేసులు


తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 753 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,68,418కి చేరింది. ఇందులో 2,56,330 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 10,667 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక కరోనాతో కొత్తగా రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1451కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు 952 మంది కోలుకున్నారని కరోనా బులెటిన్ పేర్కొన్నది.

Tags :
|

Advertisement