Advertisement

తెలంగాణాలో తాజా కరోనా కేసులు ఎన్నో తెలుసా !

By: Sankar Sun, 20 Dec 2020 10:25 AM

తెలంగాణాలో తాజా కరోనా కేసులు ఎన్నో తెలుసా !


తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో 592 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,81,414కి చేరింది. ఇందులో 2,73,013 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,888 కేసులు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి చెందినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు.

దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 1513 మంది కరోనాతో మృతి చెందారు. తెలంగాణలో రాత్రి 8 గంటల వరకు 41,970 కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 64,43,052 కరోనా టెస్టులు నిర్వహించినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు.

Tags :
|

Advertisement