Advertisement

  • తెలంగాణాలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు ....

తెలంగాణాలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు ....

By: Sankar Tue, 01 Dec 2020 10:03 AM

తెలంగాణాలో తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు ....


తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వెయ్యికంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.

ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,318కి చేరింది. ఇందులో 2,69,230 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,627 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనాతో ముగ్గురు మరణించారు.

దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1461కి చేరింది. నిన్న ఒక్కరోజు 894 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Tags :
|

Advertisement