Advertisement

తెలంగాణాలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు ..

By: Sankar Wed, 30 Dec 2020 11:03 AM

తెలంగాణాలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు ..


తెలంగాణలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక పక్క స్ట్రెయిన్ గుబులు పుట్టిస్తున్న తరుణంలో కరోనా కేసులు పెరగడం కూడా టెన్షన్ పెడుతోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 474 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ముగ్గురు మృతి చెందారు..

ఇదే సమయంలో 592 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,85,939కు పెరగగా.. ఇప్పటి వరకు 1538 మంది కరోనాతో మృతి చెందారు.. 2,78,523 మంది రికవరీ అయ్యారు.. ఇక, కరోనా మరణాలు దేశంలో 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయి..

రికవరీ రేటు దేశంలో 97.40 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 96 శాతానికి పెరిగిందని బులెటిన్‌ లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 5,878 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 3,735 హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,590 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... టెస్ట్‌ల సంఖ్య 68,39,281కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.

Tags :
|

Advertisement