Advertisement

తెలంగాణాలో తాజాగా 397 కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Tue, 29 Dec 2020 12:54 PM

తెలంగాణాలో తాజాగా 397 కరోనా పాజిటివ్ కేసులు


తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 397 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 627 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,85,465 కు పెరగగా.. ఇప్పటి వరకు 1,535 మంది కరోనాతో మృతిచెందారు.. 2,77,931 మంది రికవరీ అయ్యారు..

ఇక, కరోనా మరణాలు దేశంలో 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయిన.. రికవరీ రేటు దేశంలో 97.36 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 95.9 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,999 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 3,838 హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు..

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,737 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... టెస్ట్‌ల సంఖ్య 67,93,691 కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.కాగా దేశంలో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి.. బ్రిటన్ లో విజృంభించిన ఈ వైరస్ ఇండియాలోకి కూడా ప్రవేశించింది..దేశంలో ఇప్పటికి వరకు ఆరు స్ట్రెయిన్ వైరస్ కేసులు నమోదు అవ్వగా అందులో రెండు హైదరాబాద్ లోనే నమోదు అయ్యాయి...

Tags :
|

Advertisement