Advertisement

తెలంగాణాలో కొత్తగా 317 కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Sat, 26 Dec 2020 4:08 PM

తెలంగాణాలో కొత్తగా 317 కరోనా పాజిటివ్ కేసులు


తెలంగాణలో శుక్రవారం నాటి కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. శుక్రవారం మొత్తం 317 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,391 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 6,618గా ఉన్నాయి. వీరిలో 4,535 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 536 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక శుక్రవారం మరో ఇద్దరు కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1529కి చేరింది.

ఇక బ్రిటన్ లో విజృంభిస్తున్న కొత్త కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది ..గత కొంతకాలంగా బ్రిటన్ నుంచి వచ్చిన వారి గురించి ఆరా తీస్తుంది ...ట్రేసింగ్ , టెస్టింగ్ , ట్రీట్మెంట్ పద్దతిని అమలుచేస్తున్నట్లు హెల్త్ డైరెక్టర్ తెలిపారు...

Tags :
|

Advertisement