Advertisement

  • తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Mon, 21 Dec 2020 10:03 AM

తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు


తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉదృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నాయి.

తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 316 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. ఇందులో 2,73,625 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,590 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇక తెలంగాణలో కొత్తగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1515 మంది కరోనాతో మృతి చెందినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.

Tags :
|

Advertisement