Advertisement

  • తెలంగాణాలో తగ్గని కరోనా ..తాజాగా 2574 కొత్త పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణాలో తగ్గని కరోనా ..తాజాగా 2574 కొత్త పాజిటివ్ కేసులు నమోదు

By: Sankar Sun, 06 Sept 2020 09:36 AM

తెలంగాణాలో తగ్గని కరోనా ..తాజాగా 2574 కొత్త పాజిటివ్ కేసులు నమోదు


తెలంగాణాలో కరోనా కేసులు నిలకడగా నమోదు అయితున్నాయి..గత కొంతకాలంగా రెండు వేలు మరియు మూడు వేలకు మధ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి..తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,574 కొత్త పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.

9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,969కి చేరగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 886కు పెరిగింది. ఇక, 24 గంటల్లో 2,927 మంది రికవరీ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 32,553 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. వీరిలో 25,449 మంది హోం క్వారంటైన్‌, హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపింది. ఇక, మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.71% ఉంటే.. తెలంగాణలో0.62% ఉందని... కోలుకున్నవారి సంఖ్య 76.2% పెరిగిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఇక శనివారం దేశవ్యాప్తంగా 86,432 కొత్తగా కరోనా కేసులు నమోదు చేయగా.. 40లక్షల మార్క్‌ను దాటింది. మరో 1,089 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 69,561కు చేరింది. మొత్తం కేసు 40,23,179గా ఉంది. ఇందులో 8,46,395 యాక్టివ్ కేసులుండగా, 31,07,223 రికవరీ కేసులు ఉన్నాయి.

Tags :
|

Advertisement