Advertisement

  • తెలంగాణాలో తగ్గని కరోనా పాజిటివ్ కేసుల ఉదృతి ..కొత్తగా 2207 కేసులు నమోదు

తెలంగాణాలో తగ్గని కరోనా పాజిటివ్ కేసుల ఉదృతి ..కొత్తగా 2207 కేసులు నమోదు

By: Sankar Fri, 07 Aug 2020 10:02 AM

తెలంగాణాలో తగ్గని కరోనా పాజిటివ్ కేసుల ఉదృతి ..కొత్తగా 2207 కేసులు  నమోదు



లంగాణలో కొత్తగా 2,207 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 75,257కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 1136 మంది పూర్తిగా కోలుకోగా .. డిశ్చార్జి అయినవారి సంఖ్య 53,239గా ఉంది.

గత 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి చెందడంతో.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా కేసుల విషయానికి వస్తే.. జీహెచ్ఎంసీలో 532, రంగారెడ్డి జిల్లాలో 196 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 70.7శాతంగా ఉంది. అలాగే 14,837 మంది హోం ఐసోలేషన్‌ ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 23,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,66,984 మందికి కరోనా పరీక్షలు చేశారు.

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే జిహెచ్ఎంసి లో 532 , రంగారెడ్డిలో 196 , మేడ్చల్ మల్కాజ్గిరి లో 136 , వరంగల్ అర్బన్ లో 142 , కామారెడ్డి లో 96 , కరీంనగర్ 93 , నిజామాబాద్ 89 , పెద్దపల్లి లో 71 , కొత్తగూడెం 82 , గద్వాల్ లో 87 , ఖమ్మం లో 85 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..

Tags :
|
|
|
|

Advertisement