Advertisement

తెలంగాణాలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు

By: Sankar Tue, 29 Sept 2020 10:22 AM

తెలంగాణాలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు


తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2072 కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,98,283కి చేరింది. ఇందులో 1,58,690 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 29,477 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1116కి చేరింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం లో 85, జీహెచ్ఎంసి లో 283, కరీంనగర్ లో 109, మేడ్చల్ లో 160, నల్గొండలో 139, రంగారెడ్డిలో 161, వరంగల్ అర్బన్ లో 85 కేసులు నమోదయ్యాయి.

ఇక ఇండియాలో నిన్నటి వరకు ప్రతిరోజూ 80వేలకు పైగా కేసులు నమోదవుతూ వస్తుండగా ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం 70,589 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 61,45,292కి చేరింది. ఇందులో 9,47,576 కేసులు యాక్టివ్ గా ఉంటె, 51,01,398 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అటు మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 776 మరణాలు సంభవించాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 96,318 కి చేరింది.

Tags :
|

Advertisement