Advertisement

  • తెలంగాణాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !

తెలంగాణాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !

By: Sankar Wed, 12 Aug 2020 10:34 AM

తెలంగాణాలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !



తెలంగాణాలో కరోనా కేసులు నిలకడగా నమోదు అయితున్నాయి ..వరుసగా మూడో రోజు 2 వేల కంటే తక్కువగా నమోదైంది. మంగళవారం రాష్ట్రంలో 1897 కొత్త కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 84,544కు చేరింది. మంగళవారం తెలంగాణలో కరోనా కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 654కు చేరింది. మంగళవారం అత్యధికంగా 1920 మంది కరోనా నుంచి కోలుకొని హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 61 వేలు దాటింది..

జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి 500 కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. హైదరాబాద్ నగర పరిధిలో మంగళవారం 479 కేసులను గుర్తించారు. మేడ్చల్‌లో 172, రంగారెడ్డి 162, సంగారెడ్డి 107, వరంగల్ అర్బన్ 87, కరీంనగర్ 64, ఖమ్మం 63 చొప్పున కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోని 33 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాగా.. కొమురం భీం ఆసిఫాబాద్ (5) జిల్లాలో మాత్రమే మంగళవారం సింగిల్ డిజిట‌్‌లో కేసులు నమోదయ్యాయి.

ఇక మంగళవారం రాష్ట్రంలో 22,972 టెస్టులు చేశారు. రాష్ట్రంలో మొత్తం 6.65 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేయగా.. 84,544 మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,596 యాక్టివ్ కేసులు ఉన్నాయి.అయితే హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గడం శుభ పరినామం అయినప్పటికీ కరోనా రాష్ట్రము లోని మిగిలిన జిల్లాల్లో పల్లెలకు కూడా పాకడం ఆందోళన రేకెత్తిస్తుంది ..

Tags :
|
|
|
|

Advertisement