Advertisement

  • కరోనా రికవరీ రేటులో రోజు రోజుకు మెరుగవుతున్న తెలంగాణ .. కొత్తగా 1896 కరోనా కేసులు

కరోనా రికవరీ రేటులో రోజు రోజుకు మెరుగవుతున్న తెలంగాణ .. కొత్తగా 1896 కరోనా కేసులు

By: Sankar Tue, 11 Aug 2020 09:30 AM

కరోనా రికవరీ రేటులో రోజు రోజుకు మెరుగవుతున్న తెలంగాణ .. కొత్తగా 1896 కరోనా కేసులు



రాష్ట్రంలో కొత్తగా మరో 1896 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. సోమవారం 18,035 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1896 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 82,647కు చేరింది. తాజాగా 8 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 645కి పెరిగింది.

కరోనాతో కొత్తగా 1788 మంది డిశ్చార్జ్‌ కాగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,374గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,628 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అందులో 15,554 మంది హోం లేదా ఇతరత్రా ఐసోలేషన్‌లో ఉంటున్నారు. రికవరీ రేటు దేశంలో 69.33 శాతం ఉండగా, తెలంగాణలో 71.84 శాతంగా ఉంది.

సోమవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 338, రంగారెడ్డి జిల్లాలో 147, కరీంనగర్‌ 121,మేడ్చల్‌ 119 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,42,875 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Tags :
|
|
|

Advertisement