Advertisement

  • తెలంగాణాలో తగ్గని కరోనా తాకిడి ..తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1891 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణాలో తగ్గని కరోనా తాకిడి ..తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1891 కరోనా పాజిటివ్‌ కేసులు

By: Sankar Sun, 02 Aug 2020 11:51 AM

తెలంగాణాలో తగ్గని కరోనా తాకిడి  ..తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1891 కరోనా పాజిటివ్‌ కేసులు



తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తాగాజా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1891 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 66,677కి చేరింది. ఒక్కరోజులో 1088 మంది కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది.

ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 47,590గా ఉంది. గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనాతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 540కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18, 547 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధితో 517 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదయ్యాయి..

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే హైదరాబాద్ పరిధిలోని జిహెచ్ఎంసి లో అత్యధికంగా 517 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఇక ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 146 , రంగారెడ్డి లో 181, నిజామాబాద్ 131, సంగారెడ్డి 111, వరంగల్ అర్బన్ లో 138 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఇక ఖమ్మంలో 47 , నల్గొండలో 46 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి

Tags :
|
|
|

Advertisement