Advertisement

  • తెలంగాణాలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..తాజాగా ఎన్ని కేసులో తెలుసా !

తెలంగాణాలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..తాజాగా ఎన్ని కేసులో తెలుసా !

By: Sankar Tue, 18 Aug 2020 11:03 AM

తెలంగాణాలో  మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..తాజాగా ఎన్ని కేసులో తెలుసా !


తెలంగాణాలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1682 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 93,937 కు చేరింది. వైరస్‌ బాధితుల్లో తాజాగా 8 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 711 కు చేరింది.

మంగళవారం 2070 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 72,202 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 21,024 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌లో పేరొంది. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 7,72,928 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. రికవరీ రేటు 76.86% ఉందని వెల్లడించింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 235, రంగారెడ్డి జిల్లాలో 166, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించింది.

Tags :
|
|
|

Advertisement