Advertisement

  • తెలంగాణాలో తాజాగా 1610 కొత్త కరోనా పాజిటివ్ కేసులు ..జిల్లాల్లో కూడా అత్యధిక కేసులు నమోదు

తెలంగాణాలో తాజాగా 1610 కొత్త కరోనా పాజిటివ్ కేసులు ..జిల్లాల్లో కూడా అత్యధిక కేసులు నమోదు

By: Sankar Tue, 28 July 2020 09:47 AM

తెలంగాణాలో తాజాగా 1610 కొత్త కరోనా పాజిటివ్ కేసులు ..జిల్లాల్లో కూడా అత్యధిక కేసులు నమోదు



తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది..సోమవారం ఒక్క రోజే తెలంగాణలో 1610 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 57,142కు చేరింది. సోమవారం 803 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ 42,909 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 75 శాతం దాటింది.

సోమవారం తెలంగాణలో 15,839 శాంపిళ్లను పరీక్షించగా.. 1610 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలగా.. మరో 809 శాంపిళ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 24 గంటల్లో కరోనా బారిన పడి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 480కి చేరింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.84 శాతంగా ఉంది. జాతీయ సగటు 2.26 శాతంతో పోలిస్తే ఇదెంతో తక్కువ. కానీ ఇతర అనారోగ్య సమస్యలు ఉండి.. కరోనా సోకి చనిపోయిన వారిని కరోనా మరణాల జాబితాలో చేర్చడం లేదని ఆరోగ్య మంత్రి ఈటల తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 531 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 172, వరంగల్ అర్బన్ జిల్లాలో 152, మేడ్చల్ జిల్లాలో 113, సంగారెడ్డి జిల్లాలో 74, నిజామాబాద్ 58, పెద్దపల్లి 48, కరీంనగర్ 48, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16, ఖమ్మం జిల్లాలో 26 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Tags :
|
|
|
|

Advertisement