Advertisement

తెలంగాణాలో కొత్తగా 1473 కరోనా పాజిటివ్ కేసులు ..

By: Sankar Mon, 27 July 2020 12:47 PM

తెలంగాణాలో కొత్తగా 1473 కరోనా పాజిటివ్ కేసులు ..



గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 1473 కరోనా కేసులు నమోదు కాగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో 506 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 168, వరంగల్ అర్బన్‌లో 111, సంగారెడ్డి జిల్లాలో 98, కరీంనగర్‌లో 91, మేడ్చల్ 86, నిజామాబాద్‌లో 41 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 55,532కి చేరగా.. మృతుల సంఖ్య 471కి చేరింది.

రాష్ట్రంలో ఒక్క రోజులో 9817 శాంపిళ్లను పరీక్షించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,63,242కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 12,955 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 0.85 శాతంగా ఉంది. జాతీయ మరణాల సగటు 2.3 శాతంతో పోలిస్తే ఇదెంతో తక్కువ కావడం గమనార్హం. ఆదివారం చేసిన టెస్టుల్లో పెద్దపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదు కాలేదు.

తెలంగాణలో మొత్తం 11,928 ఐసోలేషన్ బెడ్లు ఉండగా.. 11,253 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. 3537 ఆక్సిజన్ బెడ్లు ఉండగా.. 2468 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. గాంధీ హాస్పిటల్‌లో మొత్తం 1890 బెడ్లు ఉండగా.. 1029 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
కాగా ఇప్పటిదాకా ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ఇక నుంచి ప్రతిరోజు ఉదయం విడుదల చేస్తాం అని అధికారులు అన్నారు ..

Tags :
|
|

Advertisement