Advertisement

తెలంగాణాలో తాజాగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !

By: Sankar Sun, 01 Nov 2020 10:10 AM

తెలంగాణాలో తాజాగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !


తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది... గతంలో కంటే కొత్త కేసుల సంఖ్య తగ్గినా... కనీసం 1400 వరకు పాజిటివ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి..

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,416 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా... 1,579 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఐదుగురు మృతిచెందారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,048కు చేరుకోగా... ఇప్పటి వరకు 2,20,466 మంది కరోనాబారినపడి తిరిగి కోలుకున్నారు... 1341 మంది మృత్యువాతపడ్డారు... కరోనా మరణాల రేటు భారత్‌లో 1.5 శాతంగా ఉంటే... రాష్ట్రంలో 0.55 శాతానికి పడిపోయింది.

ఇక రికవరీ రేటు దేశవ్యాప్తంగా 91.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 91.84 శాతంగా ఉందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో 18,241 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 15,388 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. నిన్న రాష్ట్రంలో 41,675 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహింంచినట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 279 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Tags :
|

Advertisement