Advertisement

తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా కేసులు ..

By: Sankar Mon, 12 Oct 2020 10:46 AM

తెలంగాణాలో భారీగా తగ్గిన కరోనా కేసులు ..

గత కొంతకాలంగా తెలంగాణాలో భారీగా కరోనా కేసులు నమోదు అయితున్నాయి ..అయితే తాజాగా నమోదు అయిన కేసులలో మాత్రం భారీగా తగ్గాయి..ఇప్పటివరకు రోజువారీ కేసులు రెండు వేలకు పైగా నమోదు అవుతుండగా ఇవాళ ఆ సంఖ్య ఏకంగా వెయ్యికి పడిపోయింది..

అయితే కరోనా కేసులు తగ్గడానికి కారణం కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా భారీగా తగ్గిపోవడమే.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,021 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 2,214 మంది కోలుకున్నారు.. ఆరుగురు మృతిచెందారు.. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,13,084కు చేరుకోగా... రికవరీ కేసులు 1,87,342కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కరోనాబారినపడి 1228 మంది మృతిచెందారు...

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.57 శాతానికి తగ్గిపోగా... రికవరీ రేటు 87.91 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వం కరోనా బులెటిన్‌లో పేర్కొంది... ఇక, గత 24 గంటల్లో రాష్ట్రంలో 30,210 కరోనా నిర్ధాన పరీక్షలు చేశారు.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షల సంఖ్య 35,77,261కు చేరింది.

Tags :
|

Advertisement