Advertisement

  • తెలంగాణాలో తగ్గని కరోనా ఉదృతి ..తాజాగా 2083 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణాలో తగ్గని కరోనా ఉదృతి ..తాజాగా 2083 పాజిటివ్ కేసులు నమోదు

By: Sankar Sat, 01 Aug 2020 10:57 AM

తెలంగాణాలో తగ్గని కరోనా ఉదృతి ..తాజాగా 2083 పాజిటివ్ కేసులు నమోదు



తెలంగాణాలో మళ్ళీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి ..తాజాగా మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు 2083 పైగా నమోదు అయ్యాయి .మరో 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 530 కు చేరుకుంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 64,786 మందికి కరోనా పాజిటవ్‌ నిర్ధారణ కాగా 46,502 మంది కోలుకున్నారని వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్‌లో వెల్లడించారు. మరో 17,754 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారని తెలిపారు. ఒక్కరోజే 1,114 కరోనా నుంచి కోలుకున్నారని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 578, రంగారెడ్డి జిల్లాలో 228, మేడ్చల్‌ జిల్లాలో 197, వరంగల్‌ అర్బన్‌లో 134 కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.

కాగా అత్యంత వేగంగా కరోనా వైరస్‌ విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ ‌రెడ్డి అన్నారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేయాలని సూచించారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆసుపత్రిలో అందుతున్న వైద్య వసతులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి టిమ్స్‌లోని వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందన్నారు.

Tags :
|

Advertisement