Advertisement

  • తెలంగాణాలో కరోనా హెల్త్ బులెటిన్ విడుదల ..కొత్తగా 1593 పాజిటివ్ కేసులు

తెలంగాణాలో కరోనా హెల్త్ బులెటిన్ విడుదల ..కొత్తగా 1593 పాజిటివ్ కేసులు

By: Sankar Sun, 26 July 2020 12:11 PM

తెలంగాణాలో కరోనా హెల్త్ బులెటిన్ విడుదల ..కొత్తగా 1593 పాజిటివ్ కేసులు



తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి తగ్గడం లేదు. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,593 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 8 మంది చనిపోయారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,059కి చేరగా, ఇప్పటి వరకు కరోనాతో 463 మంది మృతి చెందారు.

కరోనా నుంచి కోలుకుని 41,332 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 12,264 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.86 శాతం కాగా, దేశ వ్యాప్తంగా ఆ రేటు 2.3 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 15,654 మంది నమూనాలను పరీక్షించగా, 1,593 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

అయితే నిన్న రాత్రి విడుదల చేయాల్సిన ఈ హెల్త్ బులెటిన్ ను కొన్ని మార్పులు చేసి ఈ రోజు ఉదయం విడుదల చేసారు..మరోవైపు ఏపీలో మాత్రం కరోనా తీవ్రత ఉదృతంగా కొనసాగుతుంది గడిచిన 24 గంటల్లో ఏడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..దీనితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా ఉంది ..

Tags :
|

Advertisement