Advertisement

తెలంగాణలో మళ్ళీ తీవ్ర స్థాయిలో కరోనా కేసులు ..

By: Sankar Tue, 14 July 2020 09:59 AM

తెలంగాణలో మళ్ళీ తీవ్ర స్థాయిలో కరోనా కేసులు ..



తెలంగాణాలో తగ్గినట్లే అనిపించిన కరోనా కేసులు సోమవారం మల్లి తీవ్ర స్థాయిలో నమోదు అయ్యాయి ..ఇందులో ఇంకా ఎక్కువ ఆందోళన కలిగించే అంశం ఏంటి అంటే జిల్లాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి ..నిన్న మొన్నటి దాకా కేవలం హైద్రాబాదు దాని పక్కన ఉన్న రెండు జిల్లాలో మాత్రమే కరోనా కేసులు నమోదు అవ్వగా తాజాగా రాష్ట్రము మొత్తం కేసులు పదుల సంఖ్యలో నమోదు అయ్యాయి ..దీనితో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు..

సోమవారం రోజు కొత్తగా కొత్తగా 1550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36,221కి చేరింది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 365కు చేరింది. రాష్ట్రంలో ఆదివారం 1269 పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదైన విషయం తెలిసిందే.

సోమవారం కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 926, రంగారెడ్డి 212, మేడ్చల్, 53, సంగారెడ్డి 19, ఖమ్మం 38, కామారెడ్డి 33, వరంగల్ అర్బన్ 16, వరంగల్ రూరల్ 8 కేసులు ఉన్నాయి.కరీంనగర్ జిల్లాలో కొత్తగా 86 కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశం. నల్గొండలో 41, మహబూబ్‌నగర్‌లో 13, నిర్మల్ జిల్లాలో 1, యాదాద్రి భువనగిరిలో 5, మహబూబాబాద్‌లో 13, పెద్దపల్లిలో 6, మెదక్‌లో 6, మంచిర్యాలలో 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10, భూపాలపల్లి జిల్లాలో 6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7, ఆదిలాబాద్‌లో 1, వికారాబాద్‌లో 3, నాగర్‌కర్నూల్‌లో 2, జనగామలో 10, నిజామాబాద్‌లో 8, వనపర్తిలో 1, సిద్దిపేటలో 10, సూర్యాపేటలో 10, గద్వాలలో 5 కేసులు నమోదయ్యాయి.

ఇక నిన్న మొత్తం 1197 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 23,679కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,178 యక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.

Tags :
|
|
|
|
|

Advertisement