Advertisement

  • తెలంగాణాలో మళ్ళీ వెయ్యి దాటిన ఒక్క రోజు కరోనా కేసులు

తెలంగాణాలో మళ్ళీ వెయ్యి దాటిన ఒక్క రోజు కరోనా కేసులు

By: Sankar Wed, 01 July 2020 9:46 PM

తెలంగాణాలో మళ్ళీ వెయ్యి దాటిన ఒక్క రోజు కరోనా కేసులు



తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మరోసారి వెయ్యి మార్కును దాటింది. జూన్ 27న 1,087 కేసులు నమోదు కాగా మళ్లీ ఈరోజే అంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. ప్ర‌భుత్వం టెస్టులు పెంచిన త‌ర్వాత రోజుకో కొత్త రికార్డు త‌ర‌హాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే జూన్ 27 తర్వాత 24 గంటల్లో వెయ్యిలోపే కేసులు నమోదు అవుతూ వచ్చాయి. మళ్లీ నాలుగు రోజుల తర్వాత ఈరోజే 1,018 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు ఏడుగురు కరోనా వల్ల మృతి చెందారు..

బుధవారం రోజు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే పెద్ద ఎత్తున 881 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో ఉంది. అక్కడ 36 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 33 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో మహబూబ్ నగర్ జిల్లా ఉంది. ఇక్కడ 10 కేసులు నమోదయ్యాయి.

ఇక వరంగల్ రూరల్ జిల్లా, మంచిర్యాల జిల్లాల్లో 9 కేసులు గుర్తించారు. ఖమ్మంలో 7, నల్గొండ, జగిత్యాల జిల్లాల్లో 4 కేసులు, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో 3 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి, కరీంనగర్, సూర్యాపేట, కామారెడ్డి, ములుగు, ఆసిఫాబాద్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రిలో 2 కేసుల చొప్పున గుర్తించారు. గద్వాల జిల్లాలో ఒక కేసు నమోదైంది.

Tags :
|
|

Advertisement