Advertisement

తెలంగాణాలో 81 శాతానికి చేరిన కరోనా రికవరీ రేట్

By: Sankar Sun, 20 Sept 2020 09:50 AM

తెలంగాణాలో 81 శాతానికి చేరిన కరోనా రికవరీ రేట్


తెలంగాణలో కరోనా కేసుల తీవ్ర కొనసాగుతూనే ఉంది.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 2,137 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఎనిమిది మంది మృతిచెందారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306కు చేరుకోగా... ఇప్పటి వరకు తెలంగాణలో మృతిచెందినవారి సంఖ్య 1,033కు పెరిగింది.

ఇక, ఇప్పటి వరకు కరోనా నుంచి 1,39,700 మంది కోలుకోగా... ప్రస్తుతం రాష్ట్రంలో 30,573 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు.. తాజా కేసుల్లో హైదరాబాద్‌లో 322 కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 182, మేడ్చల్‌లో 146 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.

దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.60 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 0.60 శాతం ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక, రికవరీ రేటు భారత్‌లో 79.65 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో మాత్రం 81.54 శాతానికి పెరిగింది...

Tags :
|

Advertisement