Advertisement

  • తెలంగాణాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు ..ఒక్కరోజే 499 కేసులు

తెలంగాణాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు ..ఒక్కరోజే 499 కేసులు

By: Sankar Fri, 19 June 2020 9:47 PM

తెలంగాణాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు ..ఒక్కరోజే 499 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు ..రోజు రోజుకి కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి ..తాజాగా శుక్రవారం ఒక్కరోజే తెలంగాణాలో 499 కేసులు నమోదు అయ్యాయి..ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదు కావడం తెలంగాణలో ఇదే తొలిసారి .. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6526కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 2976గా ఉన్నాయి. గత 24 గంటల్లో 51 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3352కు చేరింది. ఇక శుక్రవారం మరో ముగ్గురు కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 198కి చేరింది.

శుక్రవారం నమోదు అయినా కేసుల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 329 కేసులు నమోదు అయ్యాయి..ఇక హైదరాబాద్కు అనుకోని ఉండే రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాలో వరుసగా 129 , నాలుగు కేసులు నమోదు అయ్యాయి ..ఇక రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో కూడా అక్కడక్కడ కేసులు నమోదు అయ్యాయి..జనగామలో 7, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 2 చొప్పున, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, భూపాలపల్లి జిల్లాల్లో 2 కేసుల చొప్పున, జనగామ, వరంగల్ అర్బన్‌లో 3 కేసులు, నల్గొండలో 4, మంచిర్యాల, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో 4, వరంగల్ రూరల్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.

Tags :
|

Advertisement