Advertisement

  • తెలంగాణాలో ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్టుల నిలిపివేత ..

తెలంగాణాలో ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్టుల నిలిపివేత ..

By: Sankar Thu, 02 July 2020 3:48 PM

తెలంగాణాలో ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్టుల నిలిపివేత ..





తెలంగాణాలో కరోనా టెస్టులకు మళ్ళీ ఆటంకాలు వచ్చాయి ..ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ల్యాబులకు కూడా పర్మిషన్ ఇచ్చింది ..అయితే ప్రైవేట్ ల్యాబులల్లో ఫలితాల మీద తెలంగాణ ప్రభుత్వం తన అసంతృప్తిని వ్యక్త పరించింది ..అయితే నేటి నుంచి 5వ తేదీ వరకు శాంపిళ్ల సేకరణ ప్రక్రియను నిలిపేస్తున్నట్లు పలు ప్రయివేట్ ల్యాబ్‌లు తెలిపాయి.

రాష్ట్రంలో 18 ప్రయివేట్ ల్యాబ్‌ల్లో కోవిడ్ టెస్టులు చేయడానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 15 రోజులుగా ప్రయివేట్ ల్యాబ్‌ల్లో టెస్టులు చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్ర బృందం.. ప్రయివేట్ ల్యాబ్‌ల్లో నిర్వహణ లోపాలను గుర్తించింది. వెంటనే సవరించుకోవాలని ఆదేశించింది.

ఇప్పటికే కొన్ని ప్రయివేట్ ల్యాబ్‌లు లోపాలను సరిదిద్దుకోగా.. మరికొన్ని ల్యాబ్‌లు మాత్రం శాంపిళ్ల సేకరణను నిలిపేశాయి. శాంపిళ్లను సేకరించే సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం, ల్యాబ్‌లను శానిటైజేషన్ చేయడం కోసం నాలుగు రోజులపాటు కరోనా టెస్టులను నిలిపేస్తున్నామని ప్రయివేట్ ల్యాబ్‌లు ప్రకటించాయి.అయితే నేరుగా ల్యాబుల్లోకి కరోనా పరీక్షల కోసం వస్తేనే టెస్టులు చేయడం లేదు అని తెలిపాయి ..అదే ప్రైవేట్ హాస్పిటల్స్ శాంపిల్ పంపిస్తే మాత్రం టెస్టులు చేయనున్నట్లు తెలిపాయి ..

Tags :
|
|

Advertisement