Advertisement

  • తెలంగాణలో అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణలో అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా

By: chandrasekar Wed, 01 July 2020 3:37 PM

తెలంగాణలో అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా


తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టుకు తెలిపింది. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్క్‌ల ఆధారంగా అందరినీ పాస్ చేసింది. ఫలితాలకు సంబంధించి గ్రేడ్లను కూడా ఇప్పటికే ప్రకటించింది.

తాజాగా అన్ని ప్రవేశ పరీక్షలను సైతం వాయిదావేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జూలై 31 వరకు అన్ని కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించించిన విషయం తెలిసిందే.

జూలై నెలాఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవకూడదని స్పష్టం చేసింది. తెలంగాణలో సోమవారం 975 కరోనా కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 410 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు. మరో 6 మరణాలు చోటుచేసుకున్నాయి.

తాజా లెక్కలతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 15,394కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 5,582 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా 253 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,559 యాక్టివ్ కేసులు నమోదులైనాయి.

Tags :

Advertisement