Advertisement

  • తెలంగాణాలో రేపు పాలీసెట్ పరీక్ష..పాటించాల్సిన నిబంధనలు ఇవే

తెలంగాణాలో రేపు పాలీసెట్ పరీక్ష..పాటించాల్సిన నిబంధనలు ఇవే

By: Sankar Tue, 01 Sept 2020 9:23 PM

తెలంగాణాలో రేపు పాలీసెట్ పరీక్ష..పాటించాల్సిన నిబంధనలు ఇవే


ఓవైపు క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్నా.. మ‌రోవైపు విద్యార్థులు విద్యాసంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుడ‌ద‌న్న ఉద్దేశంతో వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం...

ఇందులో భాగంగా రేపు (సెప్టెంబ‌ర్ 2వ తేదీన‌) పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) నిర్వ‌హించేందుకు ఇప్ప‌టికే అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది పాలిసెట్ కోసం 73,918 మంది దరఖాస్తు చేసుకున్నార‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా 285 సెంట‌ర్ల‌లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్టు అధికారులు వివ‌రించారు.

పాలిసెట్ ఉదయం 11 గంటల నుండి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.. అయితే, ఉద‌యం 10 గంటలకు అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమ‌తిస్తారు.. ఇక‌, పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యం అయిన ఎలాంటి ప‌రిస్థితుల్లో ప‌రీక్ష కేంద్రంలోకి అనుమ‌తించారు. దీంతో పాటు.. అభ్యర్థులు త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధరించి రావాల్సి ఉంటుంది. సానిటైజర్, వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాల‌ని సూచించారు అధికారులు..

Tags :
|

Advertisement