Advertisement

  • Breaking News: ఆస్తుల వివరాలు స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు...!

Breaking News: ఆస్తుల వివరాలు స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు...!

By: Anji Sun, 18 Oct 2020 10:54 AM

Breaking News: ఆస్తుల వివరాలు స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు...!

జీహెచ్ఎంసీ సహా పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయేతర ఆస్తులను ప్రజలు స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 75.74 లక్షల వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ఆన్లైన్లో నమోదైనట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు.

జీహెచ్ఎంసీ, మున్సిపాల్టీల్లో యజమానులు సొంతంగా వివరాలు నమోదు చేసే అవకాశాన్ని కల్పించినట్లు చెప్పారు.www.npb.telangana.gov.in వెబ్సైట్, మీసేవా కేంద్రాల ద్వారా వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నమోదు చేసుకోవచ్చని సీఎస్ వివరించారు.

ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే మీసేవా కేంద్రాల్లో ఉచితంగానే ఆస్తుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఆస్తిపన్ను సంఖ్య, ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, యజమాని ఫోటో, ఆస్తి విస్తీర్ణం వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రవాసులు, విదేశీయులు వారి ఆస్తుల వివరాల నమోదు విధివిధానాలను విడిగా ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.

Tags :

Advertisement