Advertisement

  • తెలంగాణ పీసీసీ చీఫ్ పై కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్

తెలంగాణ పీసీసీ చీఫ్ పై కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్

By: Sankar Tue, 08 Dec 2020 08:59 AM

తెలంగాణ పీసీసీ చీఫ్ పై కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్


తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో... కొత్త పీసీసీ చీఫ్ వేట మొదలు పెట్టింది అధిష్టానం... జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత తన పదవికి రాజీనామా చేస్తూ ఉత్తమ్ రాసిన లేఖ అధిష్టానికి చేరింది.. దీంతో.. అధిష్టానం కొత్త పీసీసీ చీఫ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది..

రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేయాలని ఏఐసీసీ ఇంచార్జ్‌కి పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది... దీని కోసం బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ ఠాగూర్... ఇక, గురువారం నుంచి రాష్ట్ర పార్టీ నేతలతో సంప్రదింపులు చేయనున్నారు.. రాష్ట్రంలో అన్ని స్థాయిలలోని పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలనే యోచనలో మాణిక్ ఠాగూర్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపనున్నారు..

ఏలాంటి వివాదాలు రాకుండా మెజారిటీ నేతల అభిప్రాయానికి ఆమోదం తెలపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. కాగా, ఉత్తమ్ రాజీనామాతో.. పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి... నేను రేస్‌లో ఉన్నానంటే.. తానూ కూడా అర్హుడిని అంటూ కొందరు నేతలు పీసీసీపై స్టేట్‌మెంట్లు ఇస్తూ వస్తున్నారు. మరి అభిప్రాయ సేకరణలో ఏం తేలనుంది.. కొత్త పీసీసీ చీఫ్ ఎవరు? అధిష్టానం ఎవరికి అవకాశం ఇవ్వనుంది అనేది మాత్రం మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Tags :
|
|

Advertisement