Advertisement

  • రాజమౌళికి తెలంగాణ ఎంపీ వార్నింగ్...ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం పాత్రఫై సంచలన వ్యాఖ్యలు

రాజమౌళికి తెలంగాణ ఎంపీ వార్నింగ్...ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం పాత్రఫై సంచలన వ్యాఖ్యలు

By: chandrasekar Tue, 27 Oct 2020 5:27 PM

రాజమౌళికి తెలంగాణ ఎంపీ వార్నింగ్...ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం పాత్రఫై సంచలన వ్యాఖ్యలు


తెలంగాణ ఎంపీ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపు రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో భీం పాత్రకు పెట్టిన టోపీ తొలగించాలిని ఎంపీ డిమాండ్ చేసారు. అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగుల బెట్టె అవకాశం ఉంది అని ఆయన రాజమౌళిని హెచ్చరించారు. మీ కలెక్షన్ల కోసం మా ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని సోయం బాపు రావు తెలిపారు. నైజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని ఆయన పేర్కొన్నారు. భీం ను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమే అని ఆయన విమర్శించారు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలి, లేకుంటే మర్యాదగా ఉండదని అని బాపురావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవలే ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్‌ పై అనేక వివాదాలు ప్రారంభమైయ్యాయి. తాజాగా కొమరం భీమ్ జయంతి సందర్భంగా మొన్న ఎన్టీఆర్ లుక్‌ని రాజమౌళి విడుదల చేశారు.

అయితే గతంలో రామ్ చరణ్ లుక్ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించగా, ఎన్‌టీఆర్ టీజర్‌కు రామ్ చరణ్ వాయిస్ అందించాడు. ఈ టీజరే ఇప్పుడు వివాదస్పదమయ్యింది. టీజర్‌లో ఎన్టీఆర్‌ ముస్లిం గెటప్‌ ఈ వివాదానికి దారితీసింది. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం పాలనపై తిరుగుబావుట ఎగరవేసిన మన్యం వీరుడి క్యారెక్టర్‌కి ఓ సామాజిక వర్గానికి సంబంధించిన టోపీ ఎలా పెడుతారని మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ టీజర్ పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

Tags :

Advertisement