Advertisement

  • కెసిఆర్ గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ..మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

కెసిఆర్ గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ..మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

By: Sankar Thu, 09 July 2020 07:25 AM

కెసిఆర్ గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ..మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్



గత కొద్దీ రోజులుగా తెలంగాణలో ఎవ్వరి నోటివెంట విన్న ఒకటే మాట ..ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడున్నారు అని ..దాదాపు పది రోజులు అయితున్న ముఖ్యమంత్రి ఎక్కడ ప్రెస్ మీట్ లో కనిపించలేదు ..దీనితో ప్రతిపక్షాలు కెసిఆర్ ఎక్కడున్నారు , ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశిస్తున్నాయి ..అయితే ఎవ్వరు దాని గురించి సమాధానం చెప్పడం లేదు .అయితే తాజాగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్ ఎక్కడ ఉంటె ఏముంది తెలంగాణాలో ఏమైనా అభివృద్ధి ఆగిందా అని ప్రశ్నించారు ..

ఆయన పట్టుదల, ధైర్యం, స్థిరత్వం ఏంటో గతంలో చేసిన దీక్షతోనే తెలిసింది. ఆయనది బలమైన గుండె. గట్టిగా ఉన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ స్పష్టం చేశారు.కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఏమైనా అమరావతిలో ఉందా? తెలంగాణ గడ్డ మీద నుంచే ఆయన పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌.. ఆంధ్రా వ్యక్తిలా మాట్లాడుతున్నారని, తెలంగాణ శత్రువులతో జత కలిశారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎ్‌సఎల్పీలో బుధవారం ఎంపీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

సెక్షన్‌-8పై అజ్ఞానాన్ని తొలగించుకోవాలని కాంగ్రెస్‌ నేతలకు హితవు పలికారు. ఆ సెక్షన్‌ గురించి మాట్లాడితే నాలుకలు చీరేస్తామని హెచ్చరించారు. పర్యావరణ నిబంధనల ప్రకారమే కొత్త సచివాలయ నిర్మాణం జరుగుతుందని, అది పూర్తయ్యాక కాంగ్రెస్‌ నేతల పిల్లలే అక్కడ సెల్ఫీలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణంపై లేని రాద్ధాంతం.. రాష్ట్రంలో కొత్త సచివాలయం కడుతుంటే ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేళ్లపాటు నిలిచి ఉండేలా, తెలంగాణకు ప్రతీకగా సచివాలయం ఉండబోతోందని చెప్పారు.




Tags :
|
|

Advertisement