Advertisement

  • భారత్ బంద్ లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

భారత్ బంద్ లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

By: Sankar Tue, 08 Dec 2020 10:25 AM

భారత్ బంద్ లో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్


కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్‌బంద్‌లో భాగంగా మంత్రి నేతృత్వంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలే బిల్లులను వ్యతిరేకిస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు ఈ బిల్లులు తీసుకువచ్చారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ సీఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రైతాంగ సంక్షేమం కోసం రైతుబంధు, బీమా పథకాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమcm లు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే బిల్లులను కేంద్రం భేషరతుగా వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags :

Advertisement