Advertisement

  • పురపాలక శాఖ ద్వారా చేప్పట్టిన పనులకి నిధులకోసం కేంద్రానికి కేటీఆర్ లేఖ

పురపాలక శాఖ ద్వారా చేప్పట్టిన పనులకి నిధులకోసం కేంద్రానికి కేటీఆర్ లేఖ

By: Sankar Wed, 30 Dec 2020 3:37 PM

పురపాలక శాఖ ద్వారా చేప్పట్టిన పనులకి నిధులకోసం కేంద్రానికి కేటీఆర్ లేఖ


తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖలు రాసాడు...రాష్ట్ర ప్రభుత్వం పురపాలక శాఖ ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలకు కేంద్ర నిధుల కోసం.. కేంద్ర పట్టణ వ్యవహారాలు మరియు హౌసింగ్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖలు రాశారు కేటీఆర్..

హైదరాబాద్ నగర సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ కోసం నిధులు కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.. వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కూడా కోరారు. ఇక, వరంగల్ నగరంలో రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న మెట్రో నియో ప్రాజెక్ట్ కి నిధులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్న తెలంగాణ మంత్రి..

పురపాలక శాఖ ద్వారా పట్టణాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. పురపాలికల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్, మానవ వ్యర్ధాల ట్రీట్మెంట్ ప్లాంట్లు, బయో మైనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కూడా నిధులు కోరారు.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఆమోదించడంతోపాటు కనీసం 20 శాతం నిధులను రానున్న కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.

Tags :
|
|
|

Advertisement