Advertisement

  • ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్..

ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్..

By: Sankar Mon, 21 Dec 2020 12:20 PM

ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్..


ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు ఈ రోజు ...దీనితో సోషల్ మీడియాలో అభిమానులు , ప్రముఖులు జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు..తాజాగా తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...''ఏపీ సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురాగ్యాలతో ఉంటూ... ఎక్కువ కాలం ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను అన్న'' అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్ కూడా సీఎం జగన్‌కు జన్మదిన శుభాకంక్షలు తెలియజేశారు.

వైఎస్ జగన్‌తో పాటు మంత్రి కేటీఆర్‌తో ఉన్న ఫోటోను ఎంపీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. అలాగే ఈ పుట్టిన రోజు సందర్భంగా ఒక మొక్కను నాటి తమ అభిమానులకు సీఎం జగన్ స్పూర్తిగా నిలవాలని ఎంపీ సంతోష్ ఆకాంక్షించారు

Tags :
|
|

Advertisement