Advertisement

  • కరోనా కేసుల్లో టాప్ టెన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ..

కరోనా కేసుల్లో టాప్ టెన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ..

By: Sankar Thu, 25 June 2020 11:20 AM

కరోనా కేసుల్లో టాప్ టెన్ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ..



కరోనా కేసుల్లో తెలంగాణ దూసుకుపోతుంది ..వరుసగా వారం రోజుల నుంచి పెరుగుతున్న కేసులతో తెలంగాణలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి , వారం క్రితం వరకు మామూలుగానే ఉన్న కరోనా వారం రోజుల్లోనే తీవ్ర స్థాయిలో విజృంభించింది ..గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ టాప్-10లో చేరింది.

మహారాష్ట్ర 1.50 లక్షల కేసుల దిశగా వెళ్తుండగా... ఢిల్లీలో కోవిడ్ బాధితుల సంఖ్య 70 వేలు దాటింది. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67 వేలు దాటింది. తర్వాతి స్థానంలో ఉన్న గుజరాత్‌లో కరోనా బాధితుల సంఖ్య 30 వేలకు చేరువలో ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు చేరువలో ఉంది. దేశంలోని కరోనా కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటానే దాదాపు 70 శాతం ఉంది.

జూన్ 14 నాటికి రాష్ట్రంలో 5 వేల లోపు కేసులు ఉన్నాయి. కేవలం పది రోజుల్లో మరో 5 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. జూన్ 18 నాటికి తెలంగాణలో కరోనా కేసులు 6 వేలు దాటాయి. వారం రోజుల్లోనే 4 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదే రీతిలో కరోనా కేసులు పెరిగితే, టెస్టుల సంఖ్యను మరింత పెంచితే తెలంగాణ టాప్-5లోకి చేరడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు..ప్రస్తుతం సౌత్ ఇండియాలో తమిళనాడు తర్వాత తెలంగాణలోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి..

Tags :
|
|

Advertisement