Advertisement

  • ఇక నుంచి ఇంటర్ విద్యార్థులకు ఒకటే హాల్ టికెట్ నెంబర్ ...కసరత్తులు చేస్తున్న తెలంగాణ ఇంటర్ బోర్డు

ఇక నుంచి ఇంటర్ విద్యార్థులకు ఒకటే హాల్ టికెట్ నెంబర్ ...కసరత్తులు చేస్తున్న తెలంగాణ ఇంటర్ బోర్డు

By: Sankar Sun, 25 Oct 2020 5:14 PM

ఇక నుంచి ఇంటర్ విద్యార్థులకు ఒకటే హాల్ టికెట్ నెంబర్ ...కసరత్తులు చేస్తున్న తెలంగాణ ఇంటర్ బోర్డు


ఇంటర్‌కు ఇకపై ఒకే నెంబర్‌తో కూడిన హాల్ టికెట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తులు చేస్తోంది.

ఇప్పటిదాకా విద్యార్ధులకు మొదటి, ద్వితీయ సంవత్సరాలకు వేర్వేరుగా హాల్ టికెట్ నెంబర్లను ఇస్తూ వచ్చారు. అయితే జాతీయ స్థాయి, ఇతర ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో కొంతమంది విద్యార్ధులు ఫస్టియర్ హాల్ టికెట్ నెంబర్‌ను వేస్తున్నారు. దీని వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తడమే కాకుండా నష్టపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ నేపధ్యంలోనే రెండేళ్లకూ ఒకే హాల్ టికెట్ నెంబర్‌ను ఇచ్చేలా బోర్డు ప్రతిపాదనలను సిద్దం చేస్తోంది. వీలయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే పరీక్షలు ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అటు ఇంటర్‌లో 30 శాతం సిలబస్ కుదింపుకు సంబంధించి ఇంటర్ బోర్డు తాజా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. కొన్ని ముఖ్యమైన సబ్జెక్ట్‌లలో 25 శాతం, మరికొన్నింటిలో 30 శాతం పాఠ్యాంశాలను తగ్గించేలా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

Tags :

Advertisement