Advertisement

  • ప్రమాదాలు జరుగుతాయనే సచివాలయ కూల్చివేతలకు మీడియాను అనుమతించడంలేదు ..

ప్రమాదాలు జరుగుతాయనే సచివాలయ కూల్చివేతలకు మీడియాను అనుమతించడంలేదు ..

By: Sankar Wed, 22 July 2020 3:41 PM

ప్రమాదాలు జరుగుతాయనే సచివాలయ కూల్చివేతలకు మీడియాను అనుమతించడంలేదు ..



తెలంగాణ సచివాలయ కూల్చివేతపై హైకోర్టు లో మరొక వాజ్యం దాఖలు అయింది ..సచివాలయ భవానల కూల్చివేత పనుల కవరేజ్‌కి అనుమతి ఇవ్వాలని వీ6 న్యూస్, వెలుగు పత్రిక దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది..ఈ విషయంపై ప్రభుత్వాన్ని సంప్రదించి గురువారం తమ నిర్ణయం చెబుతామని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. కూల్చివేతల సందర్భంగా సచివాలయ పరిసర ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు. కూల్చివేతల వద్ద ప్రమాదాలు వాటిల్లుతాయనే కారణంతోనే అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.

అయితే, భవానల కూల్చివేతలో ప్రభుత్వం గోప్యత పాటిస్తుందని పిటీషనర్ కోర్టుకు తెలిపారు. ప్రజలకు అసలు ఏం జరుగుతుందో తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు ప్రసార మద్యమల్లో వారికి తెలిసే ప్రయత్నం చేస్తున్నామని పిటిషనర్ కోరారు. ప్రభుత్వం ఎందుకు మీడియాకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. కూల్చివేతల వలన ప్రమాదాలు జరుగుతాయని ఎవ్వరిని అనుమతించడం లేదని ఏజీ కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వమే వీడియోలు లేదా ఫోటోలు తీసి పంపించడం సాధ్యం కాదా అని హైకోర్టు సూచించగా.. ప్రభుత్వాన్ని సంప్రదించి తమ నిర్ణయం చెపుతామని ఏజీ చెప్పారు. గురువారంలోగా ప్రభుత్వ నిర్ణయం తెలపాలన్న హైకోర్టు ఏజీని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Tags :
|

Advertisement