Advertisement

  • మేము ఎన్ని సార్లు చేపిన మా ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదు ..హైకోర్టు

మేము ఎన్ని సార్లు చేపిన మా ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదు ..హైకోర్టు

By: Sankar Mon, 27 July 2020 1:39 PM

మేము ఎన్ని సార్లు చేపిన మా ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదు ..హైకోర్టు



తెలంగాణ లో కరోనా పరిస్థితిపై హైకోర్టు మరొకసారి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది ..ఇప్పటికే ఎన్నో సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించిన హైకోర్టు తాజాగా మరొక సారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది..కరోనా కేసుల్లో తమ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కోర్టు వ్యాఖ్యానించింది.

జూన్‌ 8 నుంచి ఒక్క ఉ‍త్తర్వును కూడా అధికారులు అమలు చేయడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పినవి అమలు చేయడం కష్టమైతే ఎందుకు వీలు కాదో చెప్పాలి అని కోర్టు కోరింది. నిన్నటి బులెటిన్‌లో కూడా సరైన వివరాలు లేవని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏం చేయమంటారో రేపు సీఎస్‌నే అడుగుతామని పేర్కొంది. కరోనా కేసులన్నింటిపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

కాగా తెలంగాణాలో కరోనా హెల్త్ బులెటిన్ ను హైకోర్ట్ ఆదేశాల తర్వాత సమగ్ర అంశాలతో ఉదయం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే ..తాజాగా తెలంగాణాలో తాజాగా 1473 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..అయితే హైకోర్టు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయంలో కెసిఆర్ మాట్లాడుతూ ఇంత కష్టపడుతున్న కూడా హైకోర్టు అలంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని మొన్న వాఖ్యానించిన విషయం తెలిసిందే...

Tags :
|

Advertisement