Advertisement

  • గాంధీ ఆసుపత్రిలో ఎందుకు కరోనా పరీక్షలు చేయడం లేదు ..ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

గాంధీ ఆసుపత్రిలో ఎందుకు కరోనా పరీక్షలు చేయడం లేదు ..ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

By: Sankar Wed, 15 July 2020 12:55 PM

గాంధీ ఆసుపత్రిలో ఎందుకు కరోనా పరీక్షలు చేయడం లేదు ..ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు



తెలంగాణ హైకోర్టు మరొకసారి ప్రభుత్వం మీద విరుచుకుపడింది ..గాంధీ ఆసుపత్రిలో ఎందుకు కరోనా పరీక్షలు చేయడం లేదు అని ప్రశ్నించింది ..గాంధీ ఆస్పత్రి మొదటి కోవిడ్‌ ఆసుపత్రిగా అందరికీ సుపరిచితం. దీంతో ఎక్కువ మంది బాధితులు ఇక్కడికే వస్తుంటారు. అయితే ఇక్కడ కోవిడ్‌ పరీక్ష లేదన్న కారణంతో వచ్చిన వారు వెనక్కి వెళ్లిపోరాదు. అలా వెళ్లిపోతే అది వారికి ప్రాణాంతకంగా మారొచ్చు. అందువల్ల గాంధీలో కూడా కరోనా పరీక్షలు నిర్వహించి తీరాలి.

ఇప్పటికే 1500 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ కిట్‌లు ఉన్నాయని, అవసరమైతే మరిన్ని కిట్‌లను అందుబాటులో ఉంచుతామని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు చెబుతున్నారు. అలాంటప్పుడు పరీక్షలు చేయడానికి ఇబ్బంది ఏముంటుంది? కరోనా వస్తే ఏ ఆస్పత్రికి వెళ్లాలి.. అవి ఎక్కడ ఉన్నాయి.. వాటిలో ఉన్న సౌకర్యాలు.. పడకల వివరాలు ఏవీ కూడా ప్రజలకు తెలియడం లేదు.

ఈ వివరాలన్నింటినీ ప్రజలకు తెలియచేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం రోజూ విడుదల చేస్తున్న హెల్త్‌ బులిటెన్‌లో పడకల సంఖ్య, ఖాళీల సంఖ్య వివరాలను తెలుగు, ఇంగ్లిష్, హిందీ పత్రికల్లో ప్రచురించాలి. ఓ ఆస్పత్రికి ఫోన్‌ చేసినప్పుడు ఆ ఆసుపత్రిలో ఉన్న పడకల ఖాళీల వివరాలను మెసేజ్‌ రూపంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలి’ అని హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags :
|
|

Advertisement