Advertisement

  • సచివాలయ కూల్చివేతలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట ..కూల్చుకోవచ్చు అంటూ అనుమతి ఇచ్చిన హైకోర్టు ..

సచివాలయ కూల్చివేతలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట ..కూల్చుకోవచ్చు అంటూ అనుమతి ఇచ్చిన హైకోర్టు ..

By: Sankar Fri, 17 July 2020 4:03 PM

సచివాలయ కూల్చివేతలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట ..కూల్చుకోవచ్చు అంటూ అనుమతి ఇచ్చిన హైకోర్టు ..



తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హై కోర్ట్ అనుమతి ఇచ్చింది ..భ‌వ‌నాల కూల్చివేత‌ను నిలిపివేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ ను కోర్టు కొట్టేసింది. భ‌వ‌నాల‌ కూల్చివేత‌కు ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని కోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర మంత్రి వ‌ర్గ నిర్ణ‌యాన్ని హైకోర్టు స‌మ‌ర్థించింది. కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ భ‌వ‌నాల కూల్చివేత ప‌నులు కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వానికి కోర్టు సూచించింది.

ఈ మేరకు కూల్చివేతలను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. అంతకుముందు రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమా.. వద్దా.. అనే విషయం స్పష్టం చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందిన కేంద్రం కూల్చివేతలపై ముందస్తు పర్యావరణ అనుమతి అవసరంలేదని హైకోర్టుకు వివరించింది. దీంతో ఆయా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. కాగా ఇదే అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్త సచివాలయం నిర్మించాలన్న తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది.

Tags :

Advertisement