Advertisement

  • జిహెచ్ఎంసి ఎన్నికలు ...నేరెడిమేట్ డివిజన్ ఓట్ల లెక్కింపుకు తొలగిన అడ్డంకి

జిహెచ్ఎంసి ఎన్నికలు ...నేరెడిమేట్ డివిజన్ ఓట్ల లెక్కింపుకు తొలగిన అడ్డంకి

By: Sankar Mon, 07 Dec 2020 3:54 PM

జిహెచ్ఎంసి ఎన్నికలు ...నేరెడిమేట్ డివిజన్ ఓట్ల లెక్కింపుకు తొలగిన అడ్డంకి


నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితం వెల్లడికి అడ్డంకి తొలగింది. నేరేడ్‌మెట్‌ కార్పొరేటర్‌ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణనలోకి తీసుకునేందుకు హైకోర్టు అనుమతి సోమవారం ఆదేశాలు ఇచ్చింది.

స్వస్తిక్ గుర్తు బదులు మరొక గుర్తుకు వచ్చిన 544 ఓట్లను లెక్కించాలంటూ తీర్పునిచ్చిన హైకోర్టు... లెక్కించకుండా మిగిలిపోయిన ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే... రిటర్నింగ్ ఆఫీసరే తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు విచక్షణ అధికారం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.

అలాగే ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర గుర్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇవ్వగా, దాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్నఅనంతరం హైకోర్టు ఈ మేరకు తీర్పు నిచ్చింది.

Tags :
|
|

Advertisement