Advertisement

  • మిస్సింగ్ కేసులపై ప్రభుత్వం మీద ఫైర్ అయిన తెలంగాణ హైకోర్ట్

మిస్సింగ్ కేసులపై ప్రభుత్వం మీద ఫైర్ అయిన తెలంగాణ హైకోర్ట్

By: Sankar Thu, 05 Nov 2020 9:02 PM

మిస్సింగ్ కేసులపై ప్రభుత్వం మీద ఫైర్ అయిన తెలంగాణ హైకోర్ట్


రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మిస్సింగ్ కేసులపై హైకోర్టు విచారణ చేపట్టింది. మిస్సింగ్ కేసులు ఎక్కువగా ఉండడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రోజురోజుకు మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్న పోలీసులు ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటీషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.

2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం 8 వేల మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇప్పుడు 2019 నుంచి 2020 నవంబర్ వరకు కేసులు రెట్టింపు అయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. ఎస్పీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీ వారే అధికంగా మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే, ఇలాంటి కేసులు పెరుగుతున్న వేళ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది..

ప్రభుత్వం పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసింది. మిస్సింగ్ కేసులపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. షీటీమ్, దర్పణ్ యాప్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, ఆపరేషన్ ముస్కాన్ లాంటి ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు వివరించింది.

Tags :

Advertisement