Advertisement

  • జాతీయ జెండాను బయటే ఎగురవేయాలని ఎక్కడైనా చట్టంలో ఉందా.. తెలంగాణ హైకోర్ట్

జాతీయ జెండాను బయటే ఎగురవేయాలని ఎక్కడైనా చట్టంలో ఉందా.. తెలంగాణ హైకోర్ట్

By: Sankar Thu, 17 Sept 2020 5:26 PM

జాతీయ జెండాను బయటే ఎగురవేయాలని ఎక్కడైనా చట్టంలో ఉందా.. తెలంగాణ హైకోర్ట్


జాతీయ జెండాను అవమానించారంటూ యాదాద్రి ఆలయ ఈవోపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టేసింది. యాదాద్రి ఈవోపై న్యాయవాది నర్సింగోజు నరేష్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆగస్టు 15న జెండా ఎగర వేయకుండా గోడకు అతికించారని పిటిషనర్ వాదించారు.

అయితే, జాతీయ జెండా కార్యాలయం లోపల గోడకు అతికించవద్దని చట్టంలో ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. జాతీయ జెండా బయటే ఎగరేయాలని చట్టంలో ఉందా అని సూటిగా ప్రశ్నించింది. కార్యాలయంలో అతికిస్తే జాతీయతను ప్రదర్షించినట్టే కదా అని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ ఆరోగ్యం ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేసింది.

ఇక మంథిని శీలం రంగయ్య లాకప్‌ డెత్‌ అంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారించింది. గతంలో ఈ కేసులో స్పెషల్‌ అధికారిగా హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ను నియమించిన సంగతి తెలిసిందే. శీలం రంగయ్య డెత్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను సీపీ అంజనీకుమార్ కోర్టుకు సమర్పించారు. రామగుండం సీపీ కాల్ డేటా హైకోర్టుకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. సీపీ సమర్పించిన అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ నాగమణి పేర్కొన్నారు. తదుపరి విచారణ ఆరు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది.

Tags :

Advertisement