Advertisement

  • యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్..

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్..

By: Sankar Sun, 20 Dec 2020 1:11 PM

యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్..


యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని హై కోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహన్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయమే స్వామి వారి బాలాయంలో సుదర్శన నరసింహా హోమం, స్వామి వారి పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం స్వామివారి, శివాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా కృష్ణ శిలలతో నిర్మించడం అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిలో తీసుకుంటున్న నిర్ణయాలు భేషుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు..

కాగా ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. భారీగా భక్తులు తరలిరావడంతో లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి సుమారు రెండుగంటల సమయం పడుతోంది. ఆలయ అధికారులు భక్తులకు లఘు దర్శనం కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు లోబడి.. థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ తర్వాతే ఆలయంలోకి భక్తులను అనుమతి ఇస్తున్నారు. యాదాద్రి అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు.

Tags :

Advertisement