Advertisement

  • కొత్త వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము ... డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు

కొత్త వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము ... డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు

By: Sankar Fri, 25 Dec 2020 7:57 PM

కొత్త వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము ... డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు


కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వ్యాప్తి చెందకుండా ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ విధానం అవలంభిస్తున్నామని డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు.

యూకే నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ చర్యలు, ప్రజల సహకారం వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తి, మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగామని వివరించారు. మున్ముందు కూడా ప్రజలు సహకరించాలని కోరారు.

బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి ఈనెల 9 నుంచి ఇప్పటి వరకు 1200 మంది వచ్చారు. యూకే నుంచి వచ్చిన వారిలో 926 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాం. ఇప్పటి వరకు ఫలితాలు వచ్చిన వారిలో 16 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారించాం అని అన్నారు..

Tags :

Advertisement