Advertisement

  • ఫోన్ లొకేషన్ ద్వారా విదేశాలనుంచి వచ్చినవారిని ట్రేస్ చేయనున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ

ఫోన్ లొకేషన్ ద్వారా విదేశాలనుంచి వచ్చినవారిని ట్రేస్ చేయనున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ

By: Sankar Wed, 23 Dec 2020 5:35 PM

ఫోన్ లొకేషన్ ద్వారా విదేశాలనుంచి వచ్చినవారిని ట్రేస్ చేయనున్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ


యూకే లో కొత్త వైరస్ విజృంబనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమతం అయింది..కరోనా వైరస్ విషయంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది..ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చిన వారు తమ సమాచారాన్ని అందించాలని ప్రభుత్వం తెలిపింది..ఇక బ్రిటన్ వచ్చినవారిలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది ..అయితే ఇది కొత్త వైరస్ వలన వచ్చిందా అనేది నిర్ధరించేందుకు శాంపిల్ లను పూణే పంపారు..

ఇక విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను ట్రేస్ చేస్తోన్న వైద్య శాఖకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైద్య శాఖ ఫోన్లను లైట్ తీసుకుంటున్నారు కొంతమంది ప్రయాణికులు. దాంతో ట్రేసింగ్ ఇబ్బందిగా మారుతోంది. అందుకే మర్కజ్ ఫార్ములాను అమలు చేయడానికి వైద్యారోగ్య శాఖ ప్లాన్ చేస్తోంది.

అంటే కరోనా తొలినాళ్లలో అవలంబించిన మర్కజ్ ఫార్ములాను ఫాలో అయితే వాళ్ళను పట్టుకోవడం ఈజీ అని అంటున్నారు. వచ్చిన అందరి ఫోన్ లొకేషన్ ద్వారా గుర్తించి వారిని ట్రేస్ చేయడానికి చూస్తోంది వైద్యారోగ్య శాఖ

Tags :

Advertisement